RCB Vs RR | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా 42వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనున్నది. ఈ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్నది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనున్నది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ రాజస్థాన్ ఒక మార్పు చేసింది. తీక్షణ స్థానంలో ఫరూఖీని తుది జట్టులోకి తీసుకున్నది. బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగబోతున్నది.
రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ ఈ సీజన్లో సొంత గ్రౌండ్లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే కసితో ఉన్నది. చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ కలిసి రావడం లేదు. ఆర్సీబీ ఇక్కడ ఈ సీజన్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్స్ కండరాల నొప్పితో బాధపడుతున్నందున ఈ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌పై రాజస్థాన్ భారీగానే ఆశలు పెట్టుకున్నది. గతంలో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీసుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నది.
ఈ సీజన్లో రెండు జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ ఇది. ఏప్రిల్ 13న జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సొంత మైదానంలో రాజస్థాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. పది పాయింట్లు, 0.472 నెట్ రన్ రేట్‌తో ఉన్నది. మరోవైపు, ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడిన రాజస్థాన్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నది. రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే.. రాజస్థాన్‌పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ 16 మ్యాచ్‌ల్లో గెలువగా.. రాజస్థాన్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచులు ఫలితం తేలలేదు. రాజస్థాన్‌పై ఆర్సీబీ అత్యధిక స్కోరు 200 కాగా.. ఆర్సీబీపై రాజస్థాన్ అత్యధికంగా 217 పరుగులు చేసింది.
ఆర్సీబీ జట్టు
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
రాజస్థాన్ రాయల్స్
యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీశ్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.
ఆర్సీబీ ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ దార్ సలాం, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్.