సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్ల మధ్య చివరగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం 69 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ అవగా.. 8 ఓవర్లలోనే సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఆ ఓటమికి ఈసారి బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (73 నాటౌట్), పటీదార్ (48), మ్యాక్స్‌వెల్ (33), దినేష్ కార్తీక్ (30 నాటౌట్) రాణించడంతో 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. కెప్టెన్ విలియమ్సన్ (0), అభిషేక్ శర్మ (0) ఇద్దరూ డకౌట్ అయ్యారు. అయితే రాహుల్ త్రిపాఠీ (58) వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. అతనికి ఎవరూ సహకరించలేదు.
ఎయిడెర్ మార్క్రమ్ (21), పూరన్ (19) కాసేపు నిలబడినా భార షాట్లు ఆడలేకపోయారు. ఆ తర్వాత జగదీష సుచిత్ (2), శశాంక్ సింగ్ (8), కార్తిక్ త్యాగి (0), భువనేశ్వర్ కుమార్ (8), ఉమ్రాన్ మాలిక్ (0) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 19,2 ఓవర్లలో 125 పరుగులకు సన్‌రైజర్స్ ఆలౌట్ అయింది.
దీంతో బెంగళూరు జట్టు 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ 5, హాజిల్‌వుడ్ 2 వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.
How good has Hasaranga been today 🔥🔥
Follow the match 👉 https://t.co/tEzGa6a3Fo#TATAIPL | #SRHvRCB pic.twitter.com/gfCN5pXCQe
— IndianPremierLeague (@IPL) May 8, 2022