సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలం ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు బెంబేలెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (5) వికెట్ల పతనానికి నాంది పలకగా.. ఆ తర్వాత కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), మ్యాక్స్‌వెల్ (12), సూయష్ ప్రభుదేశాయి (15), షాబాజ్ అహ్మద్ (7), దినేష్ కార్తీక్ (0), హర్షల్ పటేల్ (4), హసరంగ (8), సిరాజ్ (2), హాజిల్‌వుడ్ (3 నాటౌట్) పరుగులు చేశారు.
ఒక్క బ్యాటర్ కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో ఆ జట్టు 16.1 ఓవర్లలో 68 పరుగలకే చాపచుట్టేసింది. సన్‌రైజర్స్ జట్టులో మార్కో జాన్సెన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. సుచిత్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ కూల్చారు.
Another low point for RCB with the bat 👀
They have been dismissed for the sixth lowest total in IPL history! #IPL2022 #RCBvSRH
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2022