రాజస్థాన్ రాయల్స్‌కు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ చుక్కలు చూపిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్.. తన తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ (7)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్లో బంతిని అందుకున్న అతను.. ఆ ఓవర్ చివరి బంతికి అశ్విన్ (17)ను పెవలియన్ చేర్చాడు.
ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ (8) అవుటయ్యాడు. దీంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. భీకరమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ కూడా అవుటవడంతో కెప్టెన్ సంజు శాంసన్ పైన భారం పెరగనుంది.