గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అలరించిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (7) స్వల్పస్కోరుకే వెనుతిరిగాడు. తన మాజీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ బోల్తా పడ్డాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
అది అతని ప్యాడ్లను తాకడంతో అంపైర్ అవుటిచ్చాడు. అయితే పడిక్కల్ రివ్యూ కోరాడు. రివ్యూలో కూడా పడిక్కల్ అవుటని తేలడంతో అతని నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో 11 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.