రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు విజయావకాశాలు దాదాపు నశించిపోయాయి. దినేష్ కార్తీక్ రనౌట్ అవడంతోనే బెంగళూరు ఓటమి ఖరారైందని అభిమానులు భావించారు. కానీ షాబాజ్ అహ్మద్ (17) క్రీజులో ఉండటంతో ఎక్కడో ఏదో ఆశ ఉంది. 16వ ఓవర్లో బంతి అందుకున్న రవిచంద్రన్ అశ్విన్.. అతన్ని పెవిలియన్ చేర్చి బెంగళూరు ఆశలు అడియాసలు చేశాడు.
ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆ జట్టు గెలవాలంటే ఇంకా 51 పరుగులు చేయాల్సి ఉంది. టెయిలెండర్లు ఎంత వరకు పోరాడతారో చూడాలి.