కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి ముగ్గురు కీలక బ్యాటర్లను కోల్పోయిన కేకేఆర్.. ఆ తర్వాతి ఓవర్లలోనే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (13) కూడా అవుటైపోయాడు. హసరంగ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన శ్రేయాస్.. లాంగాన్‌లో డు ప్లెసిస్‌కు చిక్కాడు.
నేరుగా వచ్చిన క్యాచ్‌ను ఆర్సీబీ కెప్టెన్ ఒడిసిపట్టేశాడు. దాంతో కేకేఆర్ కెప్టెన్ నిరాశగా మైదానాన్ని వీడాడు. అయ్యర్ అవుటవడంతో శామ్ బిల్లింగ్స్ క్రీజులోకి వచ్చాడు. 46 పపరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కేకేఆర్.. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. బెంగళూరు బౌలర్లలో ఆకాష్ దీప్ 2, సిరాజ్ ఒకటి, హసరంగ ఒక వికెట్ తీసుకున్నారు.