– బి. శ్రీలక్ష్మి, పెంబర్తి.
ముందు అదృష్టం అంటే ఏంటో మీకు తెలియాలి. ‘దృష్టము’ అంటే కనిపించేది. ‘అ-దృష్టము’ అంటే కనిపించనిది. ‘అస్పష్టం’ అని అర్థం. ఈ మానవ ప్రపంచం, సమస్త విశ్వం.. ఆ కనిపించని దాని చేతిలోనే ఉంది. కదిలే బండి చక్రానికి, కదలని ‘ఇరుసు’ ఆధారం అయినట్లుగా.. దృష్టమైన ఈ ప్రపంచం వెనక ఆ అదృశ్య శక్తి ప్రధానమైనది. కారులోని ఒక శక్తి.. కారు ‘ముందుకు’ వెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఆ శక్తిని ఒక పద్ధతిలో వాడుకుంటే, అదే శక్తి కారు ‘వెనక్కి’ నడవడానికి పనికొస్తుంది. ఒక భౌతికమైన నిర్మాణంతో ఉన్న ‘గేరు’ మార్చగానే.. అదే శక్తి కారును వెనక్కి వెళ్లేలా చేసింది. శక్తి మంచిది కాదు-చెడ్డదీ కాదు. వాడుకునే దానిని బట్టి ఉంటుంది. ఉపయోగపడుతుంది. అదృష్టం అంటే.. మీరు అనుకునే ‘తలరాత’, అది మనిషిలో మారకుండా ఉంటుందనే అర్థంలో వాడేది కాదు. శక్తి (నియోగం) ఉపయోగపడాలి. సరైన సమయంలో, సరైన స్థానంలో.. ఆ కోణంలో అర్థం చేసుకోవాలి.
వెనక సీట్లో కూర్చొని ముందున్న స్టీరింగ్ తిప్పలేం. కారు నడపలేం. అందుకు కారు అనుకూలత, స్థానం, బ్రేకు, గేర్లు.. అన్నీ సరైన విధంగా అమర్చి ఉండాలి. ఇల్లు కూడా అంతే! ఒక గృహంలో అమరని శక్తి.. మరొక గృహంలో అమరి ఉంటుంది. అదే.. ‘అదృష్టమైన శక్తి’. దేనికైనా.. ‘అదృష్టం ఉండాలిరా’ అని ఎందుకంటారు? అంటే, అస్పష్టంగా ఉండే ఆ మహాశక్తి, ఆ ‘విశ్వాత్మ’ ఆ క్షణం మనల్ని ముందుకు నడిచేలా అమరి ఉండాలి అన్న భావనతో వాడతారు. శక్తిలేని చోటు లేదు. కానీ, దానిని ఒడిసిపట్టుకొని వాడే పద్ధతికి ‘శాస్త్రం’ అని పేరు. అదే గృహంగా రూపుదిద్దుతుంది. చెడిపోయిన కారు నుంచి దిగి మరో నడిచే కారులో కూర్చుని గమ్యం చేరినట్టు.. అనుకూల శక్తులు లేని వక్రగృహం నుంచి మారితే కూడా, అలాగే సరైన స్థాయికి చేరుకుంటారు. అక్కడ కారు మారింది. ఇక్కడ ఇల్లు మారుతుంది. వ్యక్తి (యజమాని) మారడు. ‘ఔషధం’ ఉంటేనే రోగాన్ని కుదిర్చేది. అలా ‘శాస్త్రం’ అంటే.. స్థితిగతిని మార్చేది అని అర్థం.
– బి. శ్రీలత, కొత్తూరు.
ఎవరో ఒకరు కట్టకుండా, ఏ వెంచర్ అయినా ఎలా ఏర్పడుతుంది? లే అవుట్ బాగుంటే ఆ చోట, స్థలాలు, వీధులు గొప్పగా కుదిరి ఉంటే.. ఆ ప్రశ్నే రాదు. ఆపినా ఆగదు. స్థలం దొరికితే చాలు రోడ్లు వేసి, ప్లాట్లు తయారు చేయగానే, ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేయగానే ఎవరూ వచ్చి ఇండ్లు కట్టరు. ఆ స్థలాలు అమ్ముడు పోతాయని కూడా చెప్పలేం.

కారణం.. అలాంటి ఎన్నో పడావుపడి ఉండటం మనం చూసి ఉంటాం. మంచి స్థలం అనేది ఉంటే ముందుగా కట్టేవారు తప్పక.. దక్షిణం-పశ్చిమం కాంపౌండు కట్టాలి. తద్వారా ఒక బలం ఏర్పడుతుంది. తిరిగి అందులో శాస్త్రబద్ధంగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అలా ఒకరిని చూసి ఒకరు ఇండ్లు కడుతూ ఉంటారు. అలా ఆ వెంచర్ కళకళలాడుతుంది. ఏదైనా ఆ స్థలంలో ‘విషయం’ ఉండాలి. అది అందరికీ శుభాలు కలిగిస్తుంది.
– డి. శ్రీరామ్, దిల్సుఖ్నగర్.
వ్యక్తులు-సమస్యలు దాదాపు కలిసే ఉంటాయి. కొందరు వాటిని అధిగమించి నడుచుకుంటారు. కొందరు వాటికి లొంగిపోతారు. మీ ఇంట్లో సమస్యలకు పెళ్లి కారణం కాకపోయి ఉండొచ్చు. పెళ్లి కోసం మీరు ఇంట్లో ఏదైనా మార్పు చేసి ఉండొచ్చు. కొత్త గది, కొత్త టాయిలెట్.. విరుద్ధమైన దిశల్లో కట్టడం లాంటివి చేయవచ్చు. ఒకసారి సరిచూసుకోండి. అల్లుడు వచ్చినవేళ.. కోడలు వచ్చినవేళ కూడా సమస్యలు వస్తాయని పెద్దలు అంటారు.

అదేదో కాదు.. ‘అభిప్రాయాలు’ మారినవేళ అని మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లోకి కొత్త వ్యక్తులు వచ్చాక.. ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి, అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, వెంటనే వ్యక్తులను దోషులుగా చూప కూడదు. ఇల్లు అనేక హృదయాల, సంప్రదాయాల ‘గులాబీల బొకే’ లాంటిది. భిన్నత్వాల ఏకత్వం ఉంటుంది. భౌతిక అంశాలతోపాటు మనోగతమైన సర్దుబాటు ఎంతో ఉంటేనే.. జీవితాలు పల్లవిస్తాయి. తొందరపడకుండా ఉంటే, అన్నీ సర్దుకుంటాయి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143