RCB : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నమహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. దాంతో ఈ టోర్నీలో పాల్గొంటున్న ఐదు ఫ్రాంచైజీలు తమ జట్టు కెప్టెన్లను ప్రకటించడమే కాకుండా జెర్సీలను విడుదల చేస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమ జట్టు జెర్సీని ఈరోజు విడుదల చేసింది.
కెప్టెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రీచా ఘోష్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్, సోఫీ డెవినె (న్యూజిలాండ్) ఫ్రాంఛైజీ జెర్సీతో ఉన్న ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. పురుషుల జట్టు జెర్సీ రంగులోనే ఈ జెర్సీని డిజైన్ చేశారు. ఎరుపు, నలుపు రంగులతో ఉన్న ఈ జెర్సీ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ జెర్సీ చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌లు చూసిన అభిమానులను అలరించేందుకు మహిళా క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. మార్చి 4న ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సత్తా చాటేందుకు ఐదు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. తొలి పోరులో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆర్సీబీ ఫ్రాంఛైజీ స్మృతి మంధానను కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. వేలంలో మంధానను రూ.3.34 కోట్ల రికార్ఢు ధరకు కొనుగోలు చేసింది.
Introducing our Bold and Stylish kit for #WPL2023!
A huge shout out to our title sponsor @KajariaCeramic, our principal sponsors Mia by Tanishq, @Dream11, Vega Beauty, Himalaya Face Care and @pumacricket.#PlayBold #SheIsBold pic.twitter.com/vDNNSbhMBP
— Royal Challengers Bangalore (@RCBTweets) March 2, 2023