Shakthi | మహిళల ఐపీఎల్ మస్కట్‌ను విడుదల చేసిన జై షా
మరో రెండు రోజుల్లో మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభంకానున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీ (BCCI) ఇప్పటికే పూర్తిచేసింది. తాగా ఈ మెగా టోర్నీకి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చేందుకు మస్కట్‌ను (Mascot) విడుదల చేసింది.
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభంకానున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీ (BCCI) ఇప్పటికే పూర్తిచేసింది. తాగా ఈ మెగా టోర్నీకి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చేందుకు మస్కట్‌ను (Mascot) విడుదల చేసింది. దీనికిసంబంధించిన వీడియోను బీసీసీ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒకచేత్తో బ్యాట్, మరో చేతిలో హెల్మెట్ పట్టుకుని రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్న చీతాను అందులో చూపించారు. దానికి శక్తి (Shakti) అని నామకరణం చేశారు. ‘అతను రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ప్రారంభం మాత్రమే’ అని రాసుకొచ్చారు. మహిళల ఐపీఎల్ ఈ నెల 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై, అహ్మదాబాద్ జట్లు తలపడనున్నాయి.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో ఐదు ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఇందుకోసం అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, లక్నో నగరాలను ఎంపిక చేశారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.1289 కోట్లకు దక్కించుకుంది. ముంబై ఫ్రాంచైజీని రూ.912 కోట్లకు ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. బెంగళూరు ఫ్రాంచైజీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.901 కోట్లకు దక్కించుకుంది. ఢిల్లీ ఫ్రాంచైజీని జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.810 కోట్లకు సొంతం చేసుకుంది. లక్నోను రూ.757 కోట్లకు కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిండ్ దక్కించుకుంది.
#WATCH | BCCI Secretary Jay Shah introduces the mascot of Women's Premier League, 'Shakti'.
(Video: Jay Shah's Twitter account) pic.twitter.com/ArvQfIGpi5
— ANI (@ANI) March 2, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

