IND vs AUS : ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లయాన్ మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు. కీలకమైన రవిచంద్రన్ అశ్విన్ (16)ను ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో, లయాన్ మరోసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. భారత్‌పై అతను ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది తొమ్మిదో సారి. భారత్ 140 వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. నయావాల్ చటేశ్వర్ పూజారా (52), అక్షర్ పటేల్ (4) క్రీజులో ఉన్నారు. పుజారా మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆస్ట్రేలియా స్పిన్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. కునేమాన్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులకు చేరువయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆస్ట్రేలియా తరఫున అత్యధికంగా 5 వికెట్లు తీసి నాలుగో బౌలర్‌గా లయన్ రికార్డు సాధించాడు.డెన్నిస్ లిల్లీ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ (37 సార్లు) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ (29 సార్లు) రెండో స్థానంలో, డెన్నిస్ లిల్లీ (23 సార్లు)మూడో స్థానంలో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్లోఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అనిల్ కుంబ్లే (10) మొదటి స్థానంలో ఉన్నాడు.