GGW vs RCBW : వడోదరలో మహిళల ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. ఆరంభ పోరు నుంచి నవీ ముంబైలో అభిమానులను అలరించిన డబ్ల్యూపీల్కు కొటాంబిలోని బీసీఏ స్టేడియంలో ఉత్కంఠ పోరాటాలకు వేదిక కానుంది. ఈ మైదానంలో తొలి పోరులో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడుతున్నాయి. తగ్గపోరు ఖాయమనిపిస్తున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అష్లీ గార్డ్నర్ బౌలింగ్ తీసుకుంది.
ప్రస్తుతం ఆర్సీబీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇరుజట్లలోనే మ్యాచ్ విన్నర్లు ఉండడంతో ఈసారి పైచేయి ఎవరిదో? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత మ్యాచ్లో శ్రేయాంక పాటిల్(5-23) విజృంభణతో చతికిలపడిన గుజరాత్ ఈసారి ప్రతీకారానికి సిద్ధమవుతోంది. ఇక్కడ గెలిస్తే గార్డ్నర్ బృందం ఆరు పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంటుంది. గాయం కారణంగా రెండు మ్యాచ్లకు దూరమైన అనుష్క శర్మ గుజరాత్ తుది జట్టులోకి వచ్చింది. గెలుపు జోరుమీదున్న ఆర్సీబీ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
🚨 Toss 🚨@Giant_Cricket won the toss and elected to field against @RCBTweets
Updates ▶️ https://t.co/KAjH515c64 #TATAWPL | #KhelEmotionKa | #GGvRCB pic.twitter.com/SVSXdsXeeg
— Women’s Premier League (WPL) (@wplt20) January 19, 2026
గుజరాత్ తుది జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డెవినె, అనుష్కా శర్మ, అష్లే గార్డ్నర్(కెప్టెన్), జార్జియా వరేహం, కనికా ఆహుజా, భారతి ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజ కన్వర్, హ్యాపీ కుమారి, రేణుకా సింగ్.
ఆర్సీబీ తుది జట్టు : గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), జార్జియా వోల్, గౌతమీ నాయక్, రీచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నడినే డీక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్నే స్మిత్, లారెన్ బెల్.