IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మరో రెండు రోజుల్లో షురూ కానుంది. మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ మ్యాచ్‌తో వేసవి క్రీడా వినోదం మొదలవ్వనుంది. తొక్కిసలాట (Stampede) ఘటనతో మూత పడిన చిన్నస్వామిలో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్మడయ్యాయి. దాదపు పది నెలలకు పైగా క్రికెట్ మ్యాచ్‌లకు నోచుకొని ఈ స్టేడియంలో ఓపెనింగ్ గేమ్ చూసేందుకు అభిమానులు పోటీపడి టికెట్లు కొనుకున్నారు. తొక్కిసలాట విషాదం వెంటాడుతున్న వేళ.. కర్నాటక క్రికెట్ సంఘం, ఆర్సీబీ కొత్త యాజమాన్యానికి ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది.
క్రీడలను.. ముఖ్యంగా క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే బెంగళూరు నగరంలో ఐపీఎల్ సందడికి మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో సన్‌రైజర్స్ హైదారబాద్(SRH)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనుంది. తాజాగా ఆర్సీబీని రూ.16 వేల కోట్లకు దక్కించుకున్న కొత్త యాజమాన్యం కర్నాటక క్రికెట్ సంఘంతో కలిసి మ్యాచ్‌ను విజయవంతం చేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది. 40 వేల మంది సామర్ధ్యమున్న స్టేడియంలో భద్రతా పర్యవేక్షణకు బెంగళూరు ఫ్రాంచైజీ అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది.
The stadium is racing against time to complete infrastructure work in response to the June 4 tragedy 👉 https://t.co/X4vQPzedLm pic.twitter.com/qdr5m3adXC
— ESPNcricinfo (@ESPNcricinfo) March 26, 2026
బుధవారం ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలను సీఈవో రాజేశ్ మీనన్ (Rajesh Menon) ప్రారంభించాడు. సాయంత్రం 4 గంటలకు సేల్ మొదలైన నాలుగు నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. కనీస ధర రూ.2,300గా ఉన్నట్టు సమాచారం. టికెట్లు అన్నీ అమ్ముడైనందున మ్యాచ్ నిర్వహణపై బెంగళూరు ఫ్రాంచైజీ, వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని కేఎస్‌సీఏ దృష్టి సారించాయి. అయితే.. స్టేడియంలో కొత్తగా చేపట్టిన నిర్మాణ పరమైన మార్పులు ఇంకా పూర్తి కాలేదు.
ఐపీఎల్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో చిన్నస్వామి స్టేడియంలో నిర్మాణ పరమైన, భద్రతా పరమైన ఏర్పాట్లను కర్నాటక క్రికెట్ సంఘం వేగవంతం చేసింది. అధికారులు, కార్మికులు విరామం లేకుండా స్టేడియం పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే.. బుధవారం సాయంత్రం నాటికి ప్రధాన గేటు దగ్గర ప్లైఫుడ్ షీట్లను ఇంకా తొలగించలేదు.

మైదానం చుట్టుపక్కల చేపట్టిన పనులు కూడా పూర్తి కాలేదు. కబ్బన్ రోడ్డు వైపు.. అభిమానులు వచ్చి, వెళ్లడానికి వీలుగా తాత్కాలికంగా గేట్లు పెట్టి దారులు ఏర్పాటు చేశారు. గేట్లకు ఇంకా వెల్డింగ్, పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. మార్చి 15 వరకూ స్టేడియాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నా సాధ్యపడలేదు. ఓపెనింగ్ మ్యాచ్‌కు రెండు రోజులే ఉన్నందున.. కార్మికులు, అధికారులు నిద్ర లేకుండా పని చేస్తున్నారు.
నిరుడు రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ సంచలన ఆటతో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. నాలుగోసారి ఫైనల్లో పంజా విసిరిన బెంగళూరు పదిహేడేళ్ల కలను సాకారం చేసుకుంది. కానీ, విజయోత్సవ యాత్ర సందర్భంగా జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట 11 మంది అభిమానులను బలిగొన్నది. మృతుల కుటంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించిన ఆర్సీబీ యాజమాన్యం సీజన్ ముందర కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నస్వామిలో జరిగే ప్రతి మ్యాచ్‌లో తొక్కిసలాట మృతుల గౌరవార్ధం 11 సీట్లను కేటాయించనుంది.