RCB : ఐపీఎల్లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB). ఇక ఐపీఎల్లో ఆర్సీబీ శకం మొదలైందని అభిమానులు సంబురపడుతున్న వేళ.. ఫ్రాంచైజీని అమ్మేయాలని యాజమాన్యం భావిస్తోంది. మంచి ధర పలికితే ఏమాత్రం ఆలోచించకుండా బెంగళూరు జట్టును వదిలించుకోవాలని అనుకుంటోంది డియాగియో గ్రేట్ బ్రిటన్ (Diageo Great Britain) సంస్థ. ఈ మద్యం కంపెనీకి చెందిన వాటాదారులు ఐపీఎల్లో జట్టును కొనసాగించేందుకు అయిష్టత చూపిస్తున్నారట. అందుకే.. ఆర్సీబీని అమ్మేయడమే మంచిదని సంస్థ ఆలోచిస్తోంది. అయితే.. చిన్నస్వామి తొక్కిసలాట, పోలీస్ కేసు తదనంతర పరిణామాల నేపథ్యంలో కొత్తవాళ్లకు జట్టును అప్పగించేందుకు ఆర్సీబీ యాజమాన్యం సిద్ధపడుతోంది.
విరాట్ కోహ్లీ (Virat Kohli)వంటి స్టార్ ఆటగాడు ఉన్న ఆర్సీబీ మార్కెట్ విలువ భారీగానే ఉంది. ‘ఐపీఎల్ విజేత’ అనే ట్యాగూ ఉండడంతో రూ.1.75లక్ష కోట్లకు ఫ్రాంచైజీని అమ్మాలని డియాగియో గ్రేట్ బ్రిటన్ కంపెనీ పావులు కదుపుతోంది. వామ్మో.. అంత రేటా? అని ఆశ్చర్యపోతున్నారంతా. అయినా సరే ఆర్సీబీని కొనేందుకు ఆరు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలతో పాటు అమెరికాకు సంబంధించిన రెండు సంస్థలు కూడా డియాగియో యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘అడార్ పూనావాలా’ (సీరమ్ ఇనిస్టిట్యూట్), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW) అధినేత పార్థ్ జిందాల్, అదానీ గ్రూప్ (Adani Group) యాజమాన్యం రేసులో ఉన్నాయని తెలుస్తోంది.
THE WAIT IS OVER
Finally RCB has made it After 18 long yearsRCB RCB 🔥 😍
RCB WON WE WON 💥💥🎉🎉
Congratulations RCB 🔥
Congratulations Virat Kohli 💐
Emotions shows the value@imVkohli#RCBvsPBKS #IPLFinal pic.twitter.com/lI6gpuC4zk
— Siddharth Yadav (@realsidYdv) June 3, 2025
ఐపీఎల్ జట్టును హస్తగతం చేసుకోవాలని పూనావాలా ఫ్యామిలీకి ఎప్పటినుంచో ఉంది. 2010లో ఆడార్స్ తండ్రి సైరస్ జట్టును కొనేందుకు ఇన్విటేషన్ టు టెండర్ కూడా వేశాడు. కానీ, సహరా గ్రూప్, రెండెజ్వస్ స్పోర్ట్స్ బిడ్స్ దక్కించుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో సగం వాటా కలిగిన పార్థ్ జిందాల్ సొంతగా ఒక జట్టుకు బాస్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకే.. ఆయన ఆర్సీబీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అదానీ గ్రూప్ కూడా తమకు ఒక ఐపీఎల్ టీమ్ ఉండాలని అనుకుంటోంది. 2022లో బీసీసీఐ కొత్తగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) అనే రెండు ఫ్రాంచైజీలను ప్రకటించింది. అప్పుడు అదానీ గ్రూప్ టైటాన్స్‌ను దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నమే చేసింది.
ఐపీఎల్లో భారీగా అభిమానగణం కలిగిన ఆర్సీబీ పంతొమ్మిదో సీజన్‌తో తమ ట్రోఫీ కలను సాకారం చేసుకుంది. అందని ద్రాక్షను పట్టేసిన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని ఘనంగా విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకుంది కానీ, చిన్నస్వామి స్టేడియానికి ఫ్యాన్స్ భారీగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది మరణించగా.. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకరమైన ఘటనతో ఆర్సీబీ యాజమాన్యం అప్రతిష్టపాలైంది.
Ambati Rayudu said “I felt genuinely happy when RCB won IPL 2025. Now they understand how hard it is to win one IPL trophy—let alone five. (laughs)” pic.twitter.com/iIhU2FBEL5
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) August 18, 2025
కనీస భద్రతా జాగ్రత్తలు తీసుకోకుండా విజయయాత్రకు సిద్ధమవ్వడంతో పోలీసు కేసు.. ఆపై చిన్నస్వామి స్టేడియంపై ఆంక్షలు విధించింది కోర్టు. అంతే.. పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వడం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ మైదానంలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా జరుగలేదు. అందుకే.. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీని అమ్మేసి.. చేతులు దులిపేసుకోవాలని అనుకుంటోంది డియాగియో గ్రేట్ బ్రిటన్ కంపెనీ.