పెర్త్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆ ఇద్దరు మేటి బ్యాటర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఏడు నెలలు అవుతోంది. ఐపీఎల్ ఆడి అయిదు నెలలు అవుతోంది. ఇప్పుడు ఆ స్టార్స్ ఇద్దరూ మళ్లీ గ్రౌండ్లోకి దిగుతున్నారు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగే తొలి వన్డే కోసం ఫుల్ ప్రిపేరయ్యారు. తమకు ఇష్టమైన వన్డే ఫార్మాట్లో చెలరేగేందుకు నెట్స్‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రికెట్ ప్రేమికులను మళ్లీ కనువిందు చేసేందుకు ఆ ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్‌ను బీసీసీఐ(BCCI) తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. బ్యాక్ ఇన్ బ్లూస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥
Rohit Sharma 🤝 Virat Kohli
🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ
— BCCI (@BCCI) October 17, 2025
కోహ్లీ సుమారు 40 నిమిషాల పాటు నెట్స్‌లో గడిపాడు. రాణా, అర్షదీప్‌తో పాటు లోకల్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. టీమ్మేట్ రోహిత్ కూడా నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేవాడు. కోహ్లీ ఆడుతుంటే బంతి సౌండ్ మారుమోగింది. కానీ టైమింగ్ కోసం రోహిత్ కష్టపడినట్లు తెలుస్తోంది. చాలాసేపటి తర్వాత నెట్స్‌లోకి భారీ షాట్స్ కొట్టాడు రోహిత్. ఆదివారం రెండు జట్ల మధ్య తొలి వన్డే జరగనున్నది. ఆ మ్యాచ్‌లో రోకో పర్ఫార్మెన్స్ కోసం జనం ఎదురుచూస్తున్నారు.
కోహ్లీ, రోహిత్ ఇద్దరు కలిసి సుమారు 600 వన్డేలు ఆడారు. ఈ సిరీస్‌తో వన్డే క్రికెట్‌కు ఆ ఇద్దరు స్టార్స్ వీడ్కోలు పలుకుతారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది ఫేర్వెల్ సిరీస్ అని కొందరంటున్నారు.