WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ పోటీ జరుగనున్నది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలై నిష్క్రమించింది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో యక్షిత భాటియా 19, హేలీ మాథ్యూస్ 15, సారధి హర్మన్ ప్రీత్ కౌర్ 33, నాట్ స్కివర్ బ్రంట్ 23, అమేలియా కౌర్ 27 పరుగులతో నాటౌట్ గా నిలిచినా ముందుకు సాగలేకపోయారు.
నిర్దేశిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ 130 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్ లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ ఫైనల్ ఆశలు అడియాసలయ్యాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్లలో ఎలిసే పెర్రీ 66, జార్జియా వార్ హమ్ 18 (నాటౌట్) పరుగులు చేశారు.