RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengalure) రికార్డులు అందరికీ తెలిసిందే. ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ బరిలోకి దిగడం.. కోట్లాది మంది అభిమానులను నిరాశపరచడం ఆ జట్టుకు పరిపాటి. మూడుసార్లు ఫైనల్ చేరినా ఒత్తిడిని జయించలేక ట్రోఫీని చేజార్చుకుంది. 17 సీజన్లుగా ‘ఐపీఎల్ చాంపియన్’ అనే ట్యాగ్ బెంగళూరు జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలింది. మెగా టోర్నీలో ఆట సంగతి అంటుంచితే.. సేవలో ఆ ఫ్రాంచైజీ పెద్ద విజయమే సాధించింది.
నీటి కరువుతో అల్లాడిపోతున్న బెంగళూరులోని పలు చెరువులకు జలకళ తీసుకొచ్చింది. అవును.. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ఓ చేయి వేసిన ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకూ రెండు చెరువులను చిత్రాన్ని మార్చేసింది. ఐపీఎల్లో చాంపియన్‌గా నిలువకున్నా సరే.. ప్రతి సీజన్లో ఆర్సీబీ జట్టుకు బెంగళూరు జనం జేజేలు కొడుతారు. అందుకనే తమవంతుగా వాళ్లకు ఏదైనా చేయాలనుకున్న ఫ్రాంచైజీ 2011లో కీలక నిర్ణయం తీసుకుంది.
Ever since RCB’s Go Green Initiative began in 2011, we have stayed committed to making Planet Earth a healthier place for future generations! 🌏
In 2024, RCB in partnership with India Cares Foundation and Friends of Lakes embarked on Lake restoration of Ittgalpura and… pic.twitter.com/SRamFoyV9E
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 5, 2024
ఇండియా కేర్స్ సంస్థ, చెరువుల సంరక్షణకు పాటుపడే వాళ్లతో చేయి కలిపింది. అందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణకు ఆర్ధిక సాయం చేయడం మొదలెట్టింది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బెంగళూరులోని ఇట్లగల్పుర, సడెనహల్లి చెరువులను పునరద్ధరించింది. నీళ్లతో నిండిన ఆ రెండు చెరువులను స్థానికులకు అప్పగించింది. ఆటతోనే కాదు మంచి మనసుతోనూ అభిమానుల మనసు గెలుచుకుంది ఆర్సీబీ. దాంతో.. మీ ఔదార్యానికి ‘హ్యాట్సాఫ్’ అంటూ బెంగళూరు ఫ్రాంచైజీ సేవాగుణాన్ని పొగుడుతూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
Waiting for that grumpy neighbour to leave so we can kick off our gully cricket game! 😒#PlayBold #ನಮ್ಮRCB #Choosebold pic.twitter.com/tM1YLtUpe6
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 5, 2024
17 సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ స్క్వాడ్ మొత్తాన్నిమార్చే ఆలోచనలో ఉంది. గత సీజన్‌తో తీవ్రంగా నిరాశపరిచిన కెప్టెన్ డూప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహ పలువురు ఆటగాళ్లను వదిలించుకొనే పనిలో ఉంది. అదే జరిగితే.. ఆ జట్టులో విరాట్ కోహ్లీ, పేసర్ సిరాజ్ మాత్రమే మిగిలే అవకాశముంది. నవంబర్ లేదా డిసెంబర్లో జరుగబోయే మెగా వేలంలో నిఖార్సైన మ్యాచ్ విన్నర్లను కొనేందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది.