Maa Nanna Super Hero | టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు(Sudheer Babu) కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’(Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా నటిస్తుండగా.. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిచంద్, సాయాజీ షిండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. డబ్బు కోసం పుట్టగానే తన కొడుకుని(సుధీర్ బాబు) అమ్ముకుంటాడు సాయి చంద్. జన్మ ఇవ్వలేకపోయిన తన కొడుకుగా పెంచుకుంటాడు షాయాజీ షిండే. అయితే తన కొడుకు కోసం 25 ఏండ్ల తర్వాత వచ్చిన తండ్రి దగ్గరికి సుధీర్ బాబు వెళతాడా లేదా పెంచిన తండ్రి దగ్గరనే ఉండి పోతాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమా రాబోతుండగా.. సమ్మోహనం వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ సుధీర్ బాబు ఇలాంటి క్లాస్ స్టోరీతో వస్తుండటంతో మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సీఏఎమ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి వి. సెల్యులాయిడ్స్ పతాకంపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.