IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అదరగొడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఏప్రిల్ 18న పంజాబ్ కింగ్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు సిద్ధమవుతోంది రజత్ పాటిదార్ బృందం.
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా తమ జట్టును అవమానపరిచే యాడ్‌ను రూపొందించిన ‘ఉబెర్’ (Uber) కంపెనీపై కేసు నమోదు చేసింది. బైక్ ట్యాక్సీ సేవల్నిగొప్పగా చూపించేందుకు ఉబెర్ తీసుకొచ్చిన కొత్త యాడ్ తమను కించపరిచేలా యాడ్ ఉందని.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం కోర్టును కోరింది. ఇంతకూ ఆ యాడ్‌లో ఏముందంటే..?
ఉబెర్ కంపెనీ తాజాగా ‘Baddies in Bengaluru’ అనే పేరుతో రూపొందించింది. అందులో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) నటించాడు. అందులో హెడ్ ఉబెర్ మోటో హెల్మెట్ ధరించి బైక్ ట్యాక్సీ మీద వెళ్తూ.. ‘నా పేరు ట్రావిస్ హెడ్. మేము హైదరాబాదీలం’ అని చెబుతాడు. కాసేపటికి మరో వ్యక్తితో కలిసి బెంగళూరులోని స్టేడియానికి వెళ్తాడు.. బైక్ ట్యాక్సి బుక్ చేసుకోగా.. 3 నిమిషాలు పడుతుందనే మెసేజ్ వస్తుంది. దాంతో, హెడ్ గబగబా స్ప్రే పెయింట్ తీసుకుంటాడు. ఎవరు మీరు అని సెక్యూరిటీ గార్డ్ అడిగితే.. మేము ప్రొడక్షన్ అని చెప్పి ఇద్దరూ స్టేడియంలోపలికి వెళ్తారు.
The Hyderabaddie is on a wicked mission. First stop, Bengaluru!😈
Catch him before he escapes on Uber Moto. Or book your own, and get a ride in just 3 minutes! 🏍️#UberMoto #TravisHead #Hyderabad #RideWithUber #Cricket #3Minutes pic.twitter.com/3dtbkyTvXO
— Uber India (@Uber_India) April 5, 2025
అక్కడ ఓ బోర్డు మీద బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ అని రాసి ఉంటుంది. హెడ్ వెంటనే తన చేతిలోని స్ప్రే పెయింట్‌తో బెంగళూరు పైన ‘రాయల్లీ ఛాలెంజ్డ్ బెంగళూరు’ అని రాసి .. పరుగులు తీస్తూ బయటకు వచ్చేస్తారు. అప్పటికే ఉబెర్ మోటో బైక్ సిద్ధంగా ఉంటుంది. బైక్ ఎక్కిన తర్వాత నాపేరుట్రావిస్ హెడ్. మేము హైదరాబాదీస్ అని హెడ్ నవ్వుతూ చెబుతాడు. 59 సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్‌ను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేసింది.
‘హైదరాబాదీలు ఒక కష్టమైన పని చేయబోతున్నారు. మొదటి అడుగు బెంగళూరులో. ఉబెర్ మోటోపై అతడు పారిపోవడానికి ముందే అతడిని పట్టుకోండి. లేదంటే మీరే ఒకటి బుక్ చేసుకోండి. 3 నిమిషాల్లోనే ట్యాక్సీ మీ ముందుంటుం’ది అనే క్యాప్షన్‌తో ఉన్నఇప్పటికే 13 లక్షల మందికిపైగా వీడియో వీక్షించారు. అయితే.. తమ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్న ఈ యాడ్‌పై ఆర్సీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు ప్రకటన ద్వారా ఉబెర్ కంపెనీ ఉద్దేశపూర్వకంగానే తమను అవమానపరిచిందని బెంగళూరు ఫ్రాంఛైజీ ఢిల్లీలోని హైకోర్టును ఆశ్రయించింది. 17వ సీజన్లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ 287 రన్స్‌తో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో మే 13న ఇరుజట్లు తలపడనున్నాయి.