PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్17: చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. కలెక్టరేట్లోని డీఆర్డీవో కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా డీఆర్డీవో ఎం కాళిందిని, జిల్లా సహకార అధికారి కార్యాలయ సిబ్బంది అనూష వ్యవహరించారు.
చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య సభ్యులు కలిసి జిల్లా సమైక్య అధ్యక్షరాలిగా పాలకుర్తి మండలం నుంచి ఎస్ స్నేహ, కార్యదర్శిగా ముత్తారం మండలం నుంచి జే శోభ, కోశాధికారిగా పెద్దపల్లి మండలం నుంచి జి స్వప్నను ఎన్నుకున్నట్లు డీఆర్డీవో వెల్లడించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన పాలక వర్గం సభ్యులు కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జే రవి కుమార్, డీపీఎం కే రవి, జిల్లా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.