Tollywwod | ఇటీవల టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. కొన్ని సార్లు అయితే ఊహించని కాంబినేషన్స్ మనమందుకు వచ్చి ప్రేక్షకులకి అమితమైన ఆనందం పంచుతున్నాయి. క్వాలిటీ విషయంలో రాజకీ పడకుండా చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని చిత్రాలు అయితే సంవత్సరాల తరబడి సెట్స్ పైనే ఉంటున్నాయి. ఇటీవల సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయేది- సందీప్‌తోనే అని అంటున్నారు. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేయాలనుకున్న కథను మెగా హీరో రామ్ చరణ్‌కి చెప్పి ఆయనని ఒప్పించి సందీప్ ఆర్సీ18 చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది.
సందీప్ వంగా చేతిలో ఉన్న కమిట్ మెంట్స్ యానిమల్ పార్క్, అల్లు అర్జున్ 24. అయితే బన్నీ ఇప్పట్లో సందీప్‌తో సినిమా చేసే అవకశాలు తక్కువగా ఉండటంతో దాని స్థానంలో రామ్ చరణ్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు లేటెస్ట్ గాసిప్. మరోవైపు రచయితగా మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్ని విజయాలు అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి సినిమాలు రచయితగా త్రివిక్రమ్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.దర్శకుడు అయ్యాక వెంకీతో ఒక్క సినిమా చేయలేదు త్రివిక్రమ్. ఆ మధ్య ఒక సినిమా అనౌన్స్ చేసిన అది పట్టాలు ఎక్కలేదు.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’… మూడు విజయాల తరువాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బన్నీ బర్త్ డే సందర్భంగా తమిళ దర్శకుడు అట్లీతో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు అల్లు అర్జున్. దాంతో వెంకటేష్ హీరోగా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే రామ్ చరణ్ – సందీప్ రెడ్డి వంగా సినిమా… వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా… ఈ రెండిటి మధ్య ఒక్క కామన్ విషయం ఉంది. అదేంటంటే ఈ రెండింటిలో నిజం ఎంత ఉందనేది ఎవరికి తెలియదు. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మాత్రమే