RCB Fans : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు చాలా స్పెషల్. ప్రతి సీజన్లో జట్టును ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు. ఈసారి ప్లే ఆఫ్స్‌కే చేరువైన ఆర్సీబీ టైటిల్ కొట్టేలా కనిపిస్తోంది. పది రోజుల బ్రేక్ తర్వాత మే 17న చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగున్న నేపథ్యంలో బెంగళూరు ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఆశ్చర్యపరచనున్నారు.
ఈమధ్యే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ గౌరవార్థం అతడి జెర్సీతో సందడి చేయనున్నారు అభిమానులు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగే మ్యాచ్ కోసం టికెట్లతో పాటు 18 నంబర్‌తో ఉన్న వైట్ జెర్సీలను భారీగా కొనుగోలు చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. శుక్రవారం ఫ్రాంచైజీ డైరక్టర్ ఆఫ్ క్రికెట్ బొబాత్ (Bobat) ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
Replica jerseys were in high demand on the streets surrounding the stadium, while RCB director of cricket Mo Bobat played down concerns that a sea of white in the stands might interfere with the visibility of the ball on the field.
Full story: https://t.co/7yobChbfEx pic.twitter.com/IcJOTBUC3l
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2025
‘టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీకి సన్మానం చేయడం, అతడి జెర్సీలను పంచడం వంటివి మేము ఏమీ ప్లాన్ చేయలేదు. కానీ, కొందరు అభిమానులు మాత్రం మే 17 న కోహ్లీ టెస్టు జెర్సీతో మైదానంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది నిజంగా క్రేజీ.. అయితే.. ఫ్యాన్స్ సందడి మా ఆటపై ప్రభావం చూపదని నేను అనుకుంటున్నా’ అని బొబత్ తెలిపాడు. ఆర్సీబీ అభిమానులు కోహ్లీపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఈ సంఘటనే నిదర్శనం కాబోతుంది అని పలువురు అంటున్నారు. మరికొందరైతే మీ అభిమానం నిజంగానే వేరే లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
టీమిండియాకు 68 టెస్టుల్లో సారథ్యం వహించిన కోహ్లీ.. 40 విజయాలు అందించాడు. దాంతో విజయవంతమైన నాయకుడిగా చరిత్రకెక్కాడు. అనంతరం రోహిత్ కెప్టెన్సీలో ఆడిన విరాట్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు మే 12న వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 30 సెంచరీలు బాదిన కోహ్లీ.. త్వరలోనే 10 వేల పరుగుల మైలురాయికి చేరుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ, అతడు మాత్రం రిటైర్మెంట్ ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతానికి ఆర్సీబీకి తొలి టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు కోహ్లీ.