NTR Stadium | ఎన్టీఆర్ స్టేడియంలో అక్రమ పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు
NTR Stadium | తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ రామానుజలరెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో వాహనాల అక్రమ పార్కింగ్‌పై అధికారులు చర్యలు చేపట్టారు.
NTR Stadium | కవాడిగూడ, మే 16 : తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ రామానుజలరెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో వాహనాల అక్రమ పార్కింగ్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. ముషీరాబాద్ సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ రామానుజలరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులతో కలసి ఎన్టీఆర్ స్టేడియంలో అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించారు.
క్రేన్ సహాయంతో ఒక్కో వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. అనంతరం ముషీరాబాద్ సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ రామానుజలరెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్టేడియంలో వాహనాల అక్రమ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ముందు వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పెడితే వాటిని సీజ్ చేసి, వేలంపాట వేస్తామని తెలిపారు. స్టేడియంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన స్టేడియంలో చెత్తా చెదారం వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేడియంలో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

