IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) క్వాలిఫయర్ 1పై గురి పెట్టగా.. విజయంతో టోర్నీని ముగించాలని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అనుకుంటోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. గత పోరులో సన్‌రైజర్స్ చేతిలో ఓడిన బెంగళూరు టేబుల్ టాపర్ అయ్యే అవకాశం చేజార్చుకుంది. సోమవారం ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ దర్జాగా క్వాలిఫయర్ 1కు దూసుకెళ్లింది. దాంతో.. ఇప్పుడు రజత్ పాటిదార్ బృందానికి లక్నోపై గెలిచితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్ వాయిదా అనంతరం మే 17న చిన్నస్వామి స్టేడియంలో చెలరేగిపోవాలనుకున్నే ఆర్సీబీకి వరుణుడు షాకిచ్చాడు. టాస్ కూడా పడకుండానే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. తర్వాత మే 23న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గెలిచి నంబర్ 1 అవ్వాలనుకున్న బెంగళూరు కల ఫలించలేదు. అభిషేక్ శర్మ మెరుపులతో 231 రన్స్ కొట్టిన హైదరాబాద్ సమిష్టి ప్రదర్శనతో ఆర్సీబీకి చెక్ పెట్టి.. ఆ జట్టు క్వాలిఫయర్ 1 అవకాశాల్ని దెబ్బతీసింది.
Last league game. Big names. Massive stakes 🔥
Get ready for one final dance before the Playoffs 💪#TATAIPL | #LSGvRCB | @LucknowIPL | @RCBTweets pic.twitter.com/eCzzkeHMzh
— IndianPremierLeague (@IPL) May 27, 2025
ఈ నేపథ్యంలో చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు విజయంపై కన్నేసింది. లక్నో మైదానంలో జరగనున్న మ్యాచ్‌లో టాపార్డర్ చెలరేగి ఆడాలని ఆర్సీబీ భావిస్తోంది. ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగి స్క్వాడ్‌లో కలవడంతో పటిదార్ టీమ్ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా కనిపిస్తుంది. అయితే.. పవర్ హిట్టర్లతో నిండిన పంత్ సేనను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పటివరకూ ఇరుజట్లు 5 సార్లు తలపడగా 3-2తో ఆర్సీబీ ఆధిపత్యం చెలాయించింది.
Flavourful knock comes to an end. ❤️🩹
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 23, 2025
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ నంబర్ 1 స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ 2వ ప్లేస్‌లో నిలిచింది. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ ఆడనుంది. లక్నోపై గెలుపొందితే ఆర్సీబీ క్వాలిఫయర్ 1కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మే 30న హార్ధిక్ పాండ్యా సేనతో ఎలిమినేటర్‌లో తలపడాల్సి వస్తుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న బెంగళూరు కల సాకారం కావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అలానే.. పంజాబ్ కూడా మొదటి ట్రోఫీ గెలవాలనే కసితో ఉంది.