Bhanwar singh | లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. రెండు భాగాలు కూడా మంచి విజయాలు సాధించాయి. అయితే ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభించింది. ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఎంత హైలెట్ అయిందో పోలీస్ ఆఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది. ‘పుష్ప’ క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన షెకావత్ ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ ఒక్క డైలాగ్‌తో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు.
ఇక పుష్ప2లో షెకావత్ పాత్రని గట్టిగానే డిసైడ్ చేశాడు సుకుమార్. తనను అవమానించి బట్టలూడదీసాడని పుష్పపై ప్రతీకారంతో అనేక చేష్టలు చేశాడు. ఎర్రచందనం దుంగలు పట్టుకునే సీన్, షెకావత్‌కి పుష్ప సారీ చెప్పే సీన్, ఆ వెంటనే పుష్ప తిరిగొచ్చి కారుతో ఢీకొట్టి స్విమ్మింగ్‌పూల్‌లో మూత్రం పోసే సీన్, చివరికి పుష్ప చేతిలో ఓడిపోయి తనని తానే ఆత్మాహుతి చేసుకునే సీన్ ఇలా ప్రతీది కూడా ఆడియన్స్‌ని ఎంతగానో అలరించాయి. అయితే భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటించాడు. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి అలరించాడు. అయితే అసలు ఆ పాత్ర నారా రోహిత్ చేయాల్సిందట.
‘భైరవం’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నా నారా రోహిత్ తాజాగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ‘ కరోనా టైమ్‌లో నేను మీసాలతో ఉన్న ఓ ఫోటోని నాకు పంపించిన నిర్మాత ఆ ఆ రోల్ గురించి చెప్పారు. అది నాకు కూడా నచ్చడంతో ఓకే అని చెప్పా. అయితే ‘పుష్ప’ని పాన్ ఇండియా లెవల్లో తీస్తుండటంతో అన్ని భాషల నటులు ఉండాలని అనుకుని భన్వర్‌సింగ్ షెకావత్ రోల్‌కి ఫహాద్ ఫాజిల్‌ని తీసుకున్నారని చెప్పుకొచ్చారు నారా రోహిత్. షెకావత్ పాత్రలో నారా రోహిత్ చేసి ఉంటే ఆయన ఫేట్ మారి ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భైరవం చిత్రంలో నారా రోహిత్‌తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా నటించారు. ఈ ముగ్గురికి మూవీ హిట్ కావడం ఎంతో అవసరం.