ముంబై: క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టు(central contract) జాబితాను బీసీసీఐ(bcci) రిలీజ్ చేసింది. 2022-23 సీజన్‌కు చెందిన లిస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(ravidra jadeja)కు ఏ ప్లస్ క్యాటగిరీలో చోటు దక్కింది. ఈసారి ఆటగాళ్లలో ఎక్కువ లాభం పొందినది అతనే. అన్ని ఫార్మాట్లలోనూ జడేజా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు డిమోషన్ దక్కింది. అతన్ని ఏ నుంచి బీ గ్రూపులోకి వేశారు. చాలా మంది క్రికెటర్లను కాంట్రాక్టు లిస్టు నుంచి తీసేశారు.
భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్, హనుమ విహారి లాంటి క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి ఔటయ్యారు. దీపక్ చాహర్(deepak chahar) ట్యాలెంట్‌ను గుర్తించినా.. అతను గత కొన్నాళ్ల నుంచి గాయం వల్ల క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతన్ని కాంట్రాక్టు లిస్టు నుంచి తొలగించారు. టెస్టుల్లో ఆడుతున్న హనుమ విహారికి కూడా కాంట్రాక్టు లిస్టులో చోటు దక్కలేదు.
NEWS 🚨- BCCI announces annual player retainership 2022-23 – Team India (Senior Men).
More details here – https://t.co/kjK4KxoDdK #TeamIndia
— BCCI (@BCCI) March 26, 2023
దీపక్ హూడా, కేఎస్ భరత్, హర్షదీప్ సింగ్‌లు.. ప్రస్తుతం గ్రేడ్ సీ క్యాటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఇక ఆ క్యాటగిరీలో శిఖర్ ధావన్(Shikar Dhawan) పేరు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ధావన్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయినా అతన్ని కాంట్రాక్టు లిస్టులోనే ఉంచింది బీసీసీఐ.
గ్రేడ్ ఏ ప్లస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఉన్నారు. గ్రేడ్ ఏలో హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, షమీ, పంత్, అక్షర్‌లు ఉన్నారు. గ్రేడ్ బీలో పూజారా, రాహుల్, అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్, గిల్ ఉన్నారు. గ్రేడ్ సీలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, చాహల్, కుల్దీప్ యాదవ్, సంజూ సాంసన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, కేఎస్ భరత్ అన్నారు.
కాంట్రాక్టు ప్రకారం ఏ ప్లస్ క్యాటగిరీ క్రికెటర్లకు ఏడు కోట్లు, ఏ క్యాటగిరీ ఆటగాళ్లకు అయిదు కోట్లు, బీ క్యాటగిరీ క్రికెటర్లకు మూడు కోట్లు, సీ క్యాటగిరీ క్రికెటర్లు కోటి ఇస్తారు.