ముంబై: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డును అందుకున్నాడు రవీంద్ర జడేజా. 2011లో గేల్ నమోదు చేసిన రికార్డును జడేజా సమం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ రవీంద్ర జడేజా వీరబాదుడుతో ఒకే ఓవర్లో 37 పరుగులు సమర్పించుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. చెన్నై చివరి ఓవర్లో జడేజా ఏకంగా 5 సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. పైగా హర్షల్ ఒక నోబాల్ కూడా వేయడంతో చివరి ఓవర్లో 37 పరుగులు రావడం విశేషం. జడేజా కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 5 సిక్సర్ల ఉన్నాయి.
6, 6, 6+Nb, 6, 2, 6, 4@imjadeja has hammered Harshal Patel for 36 runs. A joint record for most runs scored by a batsman in 1 over of #VIVOIPL ever! pic.twitter.com/1nmwp9uKc0
— IndianPremierLeague (@IPL) April 25, 2021