మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 16:28:26

ఆస్ట్రేలియా మాజీల‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్‌

ఆస్ట్రేలియా మాజీల‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ల‌కు దిమ్మ దిరిగిపోయే పంచ్ ఇచ్చాడు టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌. బ్రిస్బేన్‌లో చారిత్ర‌క విజ‌యం త‌ర్వాత త‌న ట్విట‌ర్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయింది. అడిలైడ్ టెస్ట్‌లో టీమిండియా 36 ప‌రుగుల‌కే ఆలౌటై దారుణంగా ఓడిన త‌ర్వాత‌.. రికీ పాంటింగ్‌, మార్క్ వా, మైకేల్ క్లార్క్‌, బ్రాడ్ హ‌డిన్‌లాంటి ఆసీస్ మాజీలు వైట్‌వాష్ త‌ప్ప‌ద‌ని హేళ‌న చేశారు. కానీ ఆ త‌ర్వాత వాళ్ల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. త‌ర్వాతి మూడు టెస్టుల్లో రెండు గెలిచి, ఒక మ్యాచ్ డ్రా చేసుకొని ఏకంగా సిరీస్‌నే ఎగ‌రేసుకుపోయింది టీమిండియా. ఇదే విష‌యాన్ని అశ్విన్ వాళ్ల‌కు గుర్తు చేస్తూ.. వాళ్లు చేసిన కామెంట్స్‌కు సంబంధించిన పేప‌ర్ క్లిప్పింగ్స్‌ను ట్వీట్‌లో పోస్ట్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాట్ ఈక్వ‌ల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అంటూ ఎడ‌మ‌వైపు ఆసీస్ మాజీల ఫొటోల‌ను, కుడి వైపు టీమిండియా ట్రోఫీతో స‌గ‌ర్వంగా నిల్చున్న ఫొటోను షేర్ చేశాడు. గ‌త నాలుగు వారాలుగా త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచినా, ప్రేమ కురిపించిన తీరుకు తాను ఫిదా అయిపోయాన‌ని కామెంట్ చేశాడు. 

VIDEOS

logo