Ashwin : సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మ్యాచ్ విన్నర్ అని తెలిసిందే. బ్యాటుతో, బంతితో చెలరేగుతూ గత కొంతకాలంగా భారత జట్టు విజయాల్లో భాగమవుతున్న అశ్విన్ తన కలను నిజం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే 105 టెస్టులు ఆడిన ఈ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియాలో ఓ మైదానంలో మాత్రం తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. అవును.. ఆస్ట్రేలియా పర్యటనలో ఇంతవరకూ పెర్త్ మైదానంలో ఒక్కసారి కూడా ఆడని ఆశూ భాయ్ ఈసారి అరంగేట్రం చేయనున్నాడు.
నవంబర్ 22, శుక్రవారం జరుగబోయే తొలి టెస్టులో అశ్విన్ ఆడడం ఖాయమైంది. దాంతో, సిరీస్ ఓపెనర్ అయిన మ్యాచ్‌లో తన సత్తా చాటేందుకు ఈ స్టార్ స్పిన్నర్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడం అశ్విన్‌కు ఇది మూడోసారి.
📢 ASHWIN SET TO PLAY THE PERTH TEST! 🇮🇳
• India opts for the lone spinner, Ravichandran Ashwin, in the First Test, targeting Australia’s left-handed batters. [Devendra Pandey, Express Sports]#Ashwin pic.twitter.com/90HgxlqZsO
— XCric (@XForMatchTwets) November 20, 2024
విరాట్ కోహ్లీ సారథ్యంలో కంగారు గడ్డపై 2018లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా జట్టులో సభ్యుడైన అశ్విన్ పెర్త్ టెస్టులో మాత్రం ఆడలేదు. నలుగురు పేసర్లను ఆడించాలనే నిర్ణయం అతడికి శాపమైంది. అనంతరం 2020-21లోనూ పెర్త్‌లో నలుగురు పేసర్లను తీసుకోవడంతో అశ్విన్ బెంచ్‌మీదే ఉండిపోయాడు. దాంతో, రెండు పర్యాయాలు అతడికి పెర్త్ మైదానంలో ఆడే అవకాశం రాలేదు. కానీ, ఈసారి కోచ్ గంభీర్ మాత్రం పెర్త్‌లో స్పెషలిస్ట్ స్నిన్నర్ అయిన అశ్విన్‌కు చాన్స్ ఇస్తున్నాడు. ఒకవేళ తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆడకుంటే అశ్విన్ 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయం.
Nathan Lyon Said “”Ashwin is an incredible bowler. I’ve gone head-to-head with him for basically my whole career, so I’ve learned a lot from Ash. He’s an incredibly smart bowler, and he’s able to learn and adapt very quickly” (Fox cricket)
— Vipin Tiwari (@Vipintiwari952) November 19, 2024
ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి మరికొన్ని గంటలే ఉంది. పెర్త్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య బిగ్ ఫైట్ రేపటితో మొదలుకానుంది. అయితే.. బొటనవేలి గాయంతో జట్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ స్థానంలో యువకెరటం దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal)ను స్క్వాడ్‌లో భాగం చేసింది. మూడోస్థానంలో పడిక్కల్‌ను పంపే విషయమై కోచ్ గౌతం గంభీర్, సారథి బుమ్రాల మధ్య చర్చ నడుస్తోందనే సమాచారం ఉంది.