Naga Chaitanya | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోవాలోని పనాజీ వేదికగా 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో అగ్ర తారలు సందడి చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా కాబోయే జంట నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత (Sobhita Dhulipala) ఈ సినీ పండుగలో సందడి చేశారు. రెడ్‌కార్పెట్‌పై ఇద్దరూ ఫొటోలకు ఫోజులిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, ఈ ఏడాది జరుగుతున్న ఇఫీ తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. 8 రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన నలుగురు ప్రముఖుల శత జయంతి వేడుకల సందర్భంగా వారికి నివాళులర్పించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌కపూర్, మధుర గాయకుడు మహమ్మద్ రఫీ, బెంగాలీ దర్శకుడు తపన్సిన్హాకు నివాళులర్పిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Elegance and legacy come alive at #IFFI2024! Yuva Samrat #NagaChaitanya & #SobhitaDhulipala grace the red carpet ahead of the special screening of ANR’s timeless masterpiece ♥️✨@chay_akkineni@sobhitaD#ANR100 #SoChay pic.twitter.com/gNKDJtjjfK
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 21, 2024
Also Read..
Dhanush | కలిసి ఉండాలనుకోవడం లేదు.. మాకు విడాకులివ్వండి : కోర్టుకు హాజరైన ధనుష్ – ఐశ్వర్య జంట
Dhanush | నయనతారతో వివాదం తర్వాత ధనుష్ తొలి పోస్ట్..! ఇంతకీ ఏమన్నారంటే..?
Akkineni Nagarjuna | నాగార్జున పిటిషన్‌పై కొండా సురేఖ కౌంటర్ దాఖలు.. నాంపల్లి కోర్టులో విచారణ