Ravichandran Ashwin | ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫ్రాంచైజీ కో ఓనర్ అయ్యాడు. గ్లోబల్ చెస్ లీగ్‌లో అతడు ‘అమెరికన్ గాంబిట్స్’ ఫ్రాంచైజీలో సహ యజమానిగా పెట్టుబడులు పెట్టాడు. టెక్ మహీంద్ర, అంతర్జాతీయ చెస్ సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ లీగ్ రెండో ఎడిషన్ రానున్న అక్టోబర్‌లో మొదలుకానుండగా తాజాగా ఇందుకు సంబంధించిన ఓ జట్టు రిప్లేస్మెంట్ను నిర్వాహకులు ప్రకటించారు.
‘చింగారి గల్ఫ్ టైటాన్స్’ స్థానంలో అమెరికన్ గాంబిట్స్ బరిలో దిగనుంది. అక్టోబర్ 3 నుంచి 12 దాకా లండన్ వేదికగా జరుగబోయే ఈ టోర్నీ రెండో ఎడిషన్‌లో అల్పైన్ ఎస్సీ పైపర్స్, పీబీజీ అలస్కన్ నైట్స్, గ్యాంగ్స్ గ్రాండ్‌మాస్టర్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ ఇతర జట్లుగా ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు పీపీ ప్రచుర, వెంకట్ కె నారాయణతో కలిసి అశ్విన్.. అమెరికన్ గాంబిట్స్లో పెట్టుబడులు పెట్టాడు.