ODI World Cup 2026 : ఐపీఎల్ 18వ సీజన్ తర్వాత టీమిండియా జెర్సీ వేసుకోని విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు అ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఘనమైన రికార్డు కలిగిన రోకో ఆసీస్‌పై చెలరేగాలని భావిస్తున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2026) సన్నద్ధతలో ఉన్న భారత జట్టుతో పాటు రోహిత్, కోహ్లీలకు కూడా ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు కొనసాగుతున్న ఫార్మాట్ ఇదే. అయితే.. ఆసీస్‌తో సిరీస్ తర్వాతే ‘రోకో’ భవితవ్యంపై స్పష్టత వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) దిగ్గజ ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘వరల్డ్ కప్ కోసమే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ఎంపిక చేశారు. వీరిద్దరూ కచ్చితంగా వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉంటారు. అయితే.. అది వారి ఫామ్, ఫిట్నెస్, పరుగులు సాధించాలనే ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. సో. నా దృష్టిలో కోహ్లీ, హిట్‌మ్యాన్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. వన్డే సిరీస్ ముగిసే సరికి ఇద్దరికి తమ ఆట గురించి ఒక అవగాహన వస్తుంది. ఇంకా ఆడగలమా? లేదా? అనేది వారే నిర్ణయించుకోగలరు. ఒకవేళ ఇక చాలు అనుకుంటే ఆస్ట్రేలియా వెటరన్ స్టీవ్ స్మిత్ మాదిరిగా వీడ్కోలు పలికాల్సి వస్తుంది’ అని శాస్త్రి వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా 2026లో వన్డే ప్రపంచ కప్ జరుగనుంది.
There’s no certainty Virat Kohli and Rohit Sharma will play the 2027 ODI World Cup as per Ravi Shastri 👀
MORE: https://t.co/1IVjsGqfDS pic.twitter.com/PwUEODAnDF
— cricket.com.au (@cricketcomau) October 13, 2025
ఆస్ట్రేలియా సిరీస్‌లో గనుక విఫలమయ్యారంటే మరో అవకాశం వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే.. వరల్డ్ కప్ లక్ష్యంగానే శుభ్‌మన్ గిల్‌కు సారథ్యం అప్పగించామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. దాంతో.. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే స్క్వాడ్‌లోకి తీసుకునే అవకాశముంది. అందుకే.. అనుభవజ్ఞులైన రోకో తమ ఫామ్, ఫిట్నెస్ చాటుకునేందుకు ఈ సిరీస్ అద్బుత అవకాశం అంటున్నాడు రవిశాస్త్రి. అక్టోబర్ 19, ఆదివారం పెర్త్ స్టేడియంలో భారత్, ఆసీస్‌ల మధ్య తొలి వన్డేతో సిరీస్ ప్రారంభం కానుంది.
🚨 India’s squad for Tour of Australia announced
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ
— BCCI (@BCCI) October 4, 2025