కాబూల్: ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం ఆఫ్ఘానిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. వచ్చేనెల 9 నుంచి యూఏఈలో జరుగబోయే ఈ టోర్నీకి గాను స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యంలో ఆ జట్టు బరిలోకి దిగనున్నది.
యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో అఫ్గాన్ సెలక్టర్లు.. రషీద్‌తో పాటు మరో నలుగురు స్పిన్నర్ల (నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఘజన్ఫర్, స్పిన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ)ను ఎంపికచేశారు.