ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఆఫ్ఘాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఒకడు. ఇప్పటి వరకు అతను 92 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. కానీ అతని ఎకానమీ మాత్రం 6.38 మాత్రమే. పూర్తిగా అసలు టీ20 క్రికెట్లో అతని ఎకానమీ చూసుకున్నా సరే అది 6.35 మాత్రమే. ఇది చూస్తేనే అతని బౌలింగ్ ఆడటం ఎంత కష్టమో తెలుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ టోర్నీల్లో ఆడే రషీద్ బౌలింగ్‌లో రిస్క్ తీసుకోవడానికి కోహ్లీ, రోహిత్, వార్నర్, విలియమ్సన్, బట్లర్ వంటి వాళ్లు కూడా ఆలోచిస్తారు. మరి ఏ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడానికి రషీద్ ఇబ్బంది పడతాడు? ఈ ప్రశ్నకు అతనే స్వయంగా సమాధానం ఇచ్చాడు. భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు బౌలింగ్ చేయడానికి తను ఇబ్బంది పడతానని రషీద్ చెప్పాడు.
టోర్నీ ఆరంభంలోనే ఆ ఆలోచన వచ్చిందని, కానీ గిల్ తన జట్టులోనే చేరడంతో సంతోషించానని అన్నాడు. ఐపీఎల్ టోర్నీ మొత్తం అతను చాలా అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. రాజస్థాన్‌తో జరిగిన ఫైనల్లో కూడా గిల్ రాణించాడు. 45 పరుగులతో అజేయంగా నిలవడమే కాకుండా.. సిక్సర్‌తో గుజరాత్‌ను గెలిపించాడు కూడా.