Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఓ బ్యాట్స్‌మెన్ విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు. ఇది క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మణిపూర్ బ్యాట్స్‌మన్ లామాబమ్ అజయ్ సింగ్ ‘హిట్ ది బాల్ ట్వైస్ రూల్ ప్రకారం పెవిలియన్‌కు చేరాడు. ఇది డొమెస్టిక్ క్రికెట్లో ఇలా అవుట్ అవడం అరుదుగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో మేఘాలయ ఎడమ చేతివాటం స్పిన్నర్ ఆర్యన్ బోరా వేసిన బంతిని అజయ్ సింగ్ డిఫెన్స్ ఆడాడు. కానీ, బంతి బ్యాట్‌కు తగిలి మళ్లీ స్టంప్స్ వైపు వెళ్తున్న సమయంలో.. వికెట్‌ను కాపాడుకునేందుకు బ్యాట్‌తో బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్యాడ్ సహాయంతో బంతిని ఆపగలిగే అవకాశం ఉన్నా.. బ్యాట్‌ను ఉపయోగించడంతో అవుట్ అవుట్‌గా ప్రకటించారు. బంతిని రెండు సార్లు కొట్టినట్లుగా భావించి మేఘాలయ అప్పీల్ చేయగా అజయ్ పెవిలియన్‌కు చేరాడు.
దీనిపై భారత మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఫన్నీగా స్పందించారు. తాను సైతం ఇదే రూల్ కింద అవుట్ అయ్యానంటూ గుర్తు చేసుకున్నాడు. కానీ, స్ట్రీట్ క్రికెట్లో ఇలా జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో తొలి షాట్‌ను డిఫెండ్ చేశానని.. స్టంప్స్ పడకుండా ప్రయత్నించే క్రమంలో బ్యాట్‌కు బంతి తగిలిందని.. ఆ రోజున వీధి మొత్తం కేకలు వేసిందని గుర్తు చేసుకున్నాడు. రంజీలో లామాబమ్ సింగ్‌ను రెండుసార్లు బంతిని షాట్ అడినట్లుగా భావించి అవుట్ అవగ్గా.. ఈ నిర్ణయాన్ని అశ్విన్ తప్పు పట్టాడు. బ్యాట్స్‌మెన్ స్టంప్స్‌ను కాపాడుకునేందుకు రెండోసారి బ్యాట్‌తో బంతిని కొడితే అవుట్ కాదని స్పష్టం చేశాడు. ఎంసీసీ లా 34 ప్రకారం.. స్టంప్స్‌ను కాపాడుకునేందుకు కాకుండా ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మెన్ రెండోసారి బంతిని కొడితేనే అవుట్. సెకండ్ హిట్ వికెట్‌ను కాపాడటానికి మాత్రమే అయితే.. బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు. అయితే, మణిపూర్ జట్టు అప్పీల్ చేయకపోవడంతో నిర్ణయం సరైందేనా? కదా? అన్నదానిపై చర్చ కొనసాగుతున్నది.

R Ashwin Post