Ranji Trophy : దేశవాళీ క్రికెట్లో వరల్డ్ కప్‌తో సమానంగా భావించే రంజీ ట్రోఫీకి వేళైంది. జాతీయ జట్టులో చోటు ఆశించే కుర్రాళ్లకు వీసా లాంటిదిగా భావించే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ రేపటి నుంచే మొదలవ్వనుంది. శుక్రవారం ప్రారంభం కానున్న రంజీ సీజన్ 2024-25 ఆరు నెలలు.. అంటే వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగనుంది. ఈసారి 32 జట్లు పాల్గొంటుండగా.. ముంబై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
నిరుడు రంజీ సీజన్లో బిజీ షెడ్యూల్‌పై పలువురు ఆటగాళ్ల అభ్యంతరాల నేపథ్యంలో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. లీగ్ మ్యాచ్‌లు.. ఆపై క్వార్టర్, సెమీస్‌లకు కొంత విరామం ఇస్తూ టోర్నీని జరిపేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్ దశలో ఒక్కో జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి.. ఆ తర్వాత ఫిబ్రవరి 17 నుంచి సెమీఫైనల్స్.. ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
Can. Not. Wait! ⏳
The prestigious #RanjiTrophy starts tomorrow 🤗
Get ready for some high-voltage action as India’s premier First-Class Tournament gets underway 🔥@IDFCFIRSTBank pic.twitter.com/JQIolj9wcY
— BCCI Domestic (@BCCIdomestic) October 10, 2024
రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో భారత్‌లోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జట్లు పోటీ పడనున్నాయి. వీటిని ఎలైట్ గ్రూప్ ఏ, ఎలైట్ గ్రూప్ బీ, ఎలైట్ గ్రూప్ సీ, ఎలైట్ గ్రూప్ డీలుగా విభజించారు. ఇంతకూ ఆ జట్లు ఏవంటే.. బరోడా, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, ముంబై, ఒడిశా, సర్వీసెస్, త్రిపుర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరాఖండ్, విదర్భ, బెంగాల్, బిహార్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, చంఢీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఘండ్, రైల్వేస్, సౌరాష్ట్ర, తమిళనాడు.
ప్లేట్ రౌండ్ విషయానికొస్తే.. రంజీ ట్రోఫీలో ఈసారి ప్లేట్ రౌండ్(Plate Round) కూడా ఉంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆరు జట్లు పోటీ పడుతాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గోవా, మణిపూర్, సిక్కిం, మిజోరాంలు అక్టోబర్ 11 నుంచి తాడోపేడో తేల్చుకోనున్నాయి. టాప్ 2లో నిలిచిన జట్లు వచ్చే సీజన్ ఎలైట్ గ్రూప్‌లో చోటు దక్కించుకునే అవకాశముంది. ఈ సీజన్లో అట్టడుగున నిలిచిన ఎలైట్ జట్లు.. ఈ టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడుతాయి.