ముంబై: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు (Ratan Tata) సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. 86 ఏళ్ల వయసులో బుధవారం తుదిశ్వాస విడిచిన ఆయన 69 ఏళ్ల వయసులో ఎఫ్-16, ఎఫ్-18 ఫైటర్ జెట్స్‌కు కో పైలట్‌గా వ్యవహరించారు. అత్యంత వేగంతో నడిపిన ఆ యుద్ధ విమానాల్లో ఆకాశంలో విన్యాసాలు చేశారు. 2007 ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోకు రతన్ టాటా హాజరయ్యారు. నాడు 69 ఏళ్ల వయస్సున్న ఆయనను ఎఫ్-16 ఫైటర్ జెట్‌కు కో-పైలట్‌గా ఉండాలని అమెరికా డిఫెన్స్ కాంట్రాక్టర్ లాక్‌హీడ్ మార్టిన్ ఆహ్వానించారు.
కాగా, జెట్ విమానాలు, హెలికాప్టర్లు నడిపే లైసెన్స్‌లు ఉన్న రతన్ టాటా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ మార్గదర్శకత్వంలో సుమారు అరగంట పాటు ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను నడిపారు. అత్యంత వేగంతో 500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు చేరుకోవడంతోపాటు నింగిలోకి దూసుకెళ్లడం వంటి విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో థ్రిల్ అయ్యారు. ఆ ఫైటర్ జెట్ ల్యాండ్ కాగానే లాక్‌హీడ్ మార్టిన్ అధికారులు రతన్ టాటాను అభినందించారు. భారత్‌లో బిలియన్ డాలర్ల డీల్ కోసం పోటీ పడిన ఆ సంస్థకు చెందిన ఎఫ్-16 ప్రతిరూపాన్ని ఆయనకు బహుకరించారు.
మరోవైపు ఆ మరునాడే రతన్ టాటా మరో ఫైటర్ జెట్‌లో ఆకాశంలో చక్కర్లు కొట్టారు. ఈసారి ఎఫ్-16 కంటే పెద్దది, శక్తివంతమైన యుద్ధ విమానాన్ని నడిపారు. బోయింగ్‌కు చెందిన ఎఫ్-18 సూపర్ హార్నెట్‌లో నింగిలో విహరించారు. చాలా కాలంగా విమానాలు నడపడంపై ఆసక్తి ఉన్న రతన్ టాటా వరుసగా రెండు రోజుల్లో ప్రపంచంలోని రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను నడిపి తన కలను నెరవేర్చుకున్నారు.
जब रतन टाटा ने उड़ाया F-16 फाइटर जेट,देखिए पूरा वीडियो
69 साल की उम्र में Ratan Tata ने उड़ाया था F-16
उनके निधन के बाद इंटरनेट पर वीडियो वायरल #RatanTata #EndOfAnEra | The Titan | The Icon | Industrialist #RatanTataSir #ShantanuNaidu #RIP_legend #TataMotors #Legacy pic.twitter.com/wKZzLbrMBD
— News1India (@News1IndiaTweet) October 10, 2024