TATA Vs Pak GDP | యావత్ భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ టాటా నిష్క్రమించారు. ఆయనతో భారత కార్పొరేట్ ప్రపంచంలో ఓ అధ్యాయం ముగిసింది. ఆయన భౌతికంగా లేకపోయినా చేసిన యావత్ భారతానికి చేసిన సేవలు, ఆయన సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతున్నాయి. టాటా గ్రూప్‌ను విజయవంతంగా నడిపిన చైర్మన్లో ఆయన ఒకరు. రతన్ టాటా భారీ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ అన్ని విభాగాల్లో టాటా కంపెనీలున్నాయి. టాటా గ్రూప్ వాల్యుయేషన్ 400 బిలియన్ డాలర్లకుపైగా ఉన్నది. ఇది దాయాది దేశం పాకిస్థాన్ జీడీపీ కన్నా ఎక్కువ. ఈ ఏడాది చివరి నాటికి పాక్ జీడీపీ 347 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఒక్క టాటా గ్రూప్ మార్కెట్ విలువ 400 బిలియన్ డాలర్లు అంటే.. రూ.33.58లక్షలకోట్లు. అయితే, ఇంతటి భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తూ వచ్చిన రతన్ టాటా ఇంత వరకు బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోవడం ఆసక్తికర అంశం.
టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్వహిస్తోంది. అందులో టాటా కుటుంబంతో అనుబంధం ఉన్న ఐదు ట్రస్టులు ఉన్నాయి. ఇందులో కీలకమైనవి రెండు. అది సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్. మరొకటి సర్ రతన్ టాటా ట్రస్ట్. టాటా సన్స్‌లో ఈ రెండింటికి ఎక్కువగా వాటాలున్నాయి. ఈ రెండు ట్రస్టులకు కంపెనీలో దాదాపు 52 శాతం వాటా ఉన్నది. ఐదు ట్రస్ట్‌లకు కలిపి టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీలో మొత్తం 67శాతం వాటా ఉన్నది. రతన్ టాటా చనిపోయే వరకు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన తన వారసుడిని ప్రకటించారు. వారసుడి ఎంపిక బాధ్యత టాటా ట్రస్ట్ బోర్డులకే వదిలేశారు. దాంతో ట్రస్ట్ బోర్డులు కొత్త చైర్మన్‌ను ఎన్నుకోనున్నాయి. టాటా వారసుఇగా నోయెల్ టాటాను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది. కంపెనీలోని బోర్డుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆగస్ట్ 2010 నుంచి నవంబర్ 2021 సేవలందించారు. ఆయన పదవీకాలంలో కంపెనీ టర్నోవర్‌ను 500 మిలియన్ డాలర్ల నుంచి 3వేల బిలియన్లకు పెంచారు.
ప్రస్తుతం, బోర్డులోని ప్రముఖ సభ్యుల్లో టీవీఎస్ చీఫ్ వేణు శ్రీనివాస్, మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ ఉన్నారు. వీరిద్దరూ టాటా ట్రస్ట్‌ల వైస్ చైర్మన్లు. అయితే, కుటుంబం నుంచి వచ్చిన వారికే చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. నోయెల్ టాటా బోర్డు ట్రస్టీగా పనిచేస్తున్నారు. ఆయన ప్రధానంగా పోటీలో ఉన్నారు. నియామకం పార్సీ సమాజంలోని ట్రస్ట్‌కు అధిపతిగా కుటుంబ సభ్యుడికి ప్రాధాన్యత ఇవ్వడంతో సమానంగా ఉంటుంది. టాటా గ్రూప్‌లో నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం కలిసిరానున్నది. టాటా ట్రస్ట్ చైర్మన్‌పై 13 మంది ట్రస్టీలు ఏకాభిప్రాయం తీసుకోనున్నారు. నోయెల్ టాటా టాటా ట్రస్ట్‌ల చైర్మన్ ఎన్నికైనట్లయితే.. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ చైర్మన్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో చైర్మన్ నియామకమవుతారు. టాటా ట్రస్ట్‌ల భవిష్యత్, టాటా సన్స్‌తో సంబంధాలను రూపొందించేలా కొత్త చైర్మన్‌పై నిర్ణయం కీలకం.
రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ చైర్మన్‌గా కొనసాగారు. పదవీకాలం టాటా గ్రూప్‌ను ఇండియన్ హెరిటేజ్ హౌస్ నుంచి గ్లోబల్ డైవర్సిఫైడ్‌గా మార్చివేశారు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17రెట్లు పెరిగింది. టాటాగ్రూప్స్ ఆదాయం రూ.18వేలకోట్ల నుంచి రూ.5.5లక్షలకోట్లకు చేరింది. డిసెంబర్ 2012లో ఐఐఎం బెంగుళూరు ప్రచురించిన పేపర్ ప్రకారం.. గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.30వేలకోట్ల నుంచి రూ.5లక్షలకోట్లకు పెరిగింది. రతన్ టాటా తన జీవితకాలంలో రూ.9వేలకోట్లు విరాళంగా అంతించారు. రతన్ జీ కేవలం పారిశ్రామికత్తనే కాదు. సమాజ శ్రేయస్సుపై దృష్టి సారించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ అభివృద్ధి, జంతు సంరక్షణ కార్యక్రమాలతో సహా సామాజిక సంక్షేంపై దృష్టి పెట్టే దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. రూ.165కోట్లతో ముంబయిలో జంతువుల కోసం అన్ని అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించారు.
రతన్ టాటా పరోపకారి. 2024 నాటికి రతన్ టాటా నికర విలువ రూ.3,800కోట్లు. ఇందులో ఎక్కువ భాగం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ద్వారా వస్తుంది. ఇందులో గణనీయమైన భాగాన్ని ఛారిటబుల్ ట్రస్ట్‌లకు విరాళంగా అందించారు. ఇది ఆయన ఉదార స్వభావాన్ని చాటిచెబుతున్నది. టాటా సన్స్ మాజీ చైర్మన్‌గా వార్షిక వేతనం రూ.2.5 కోట్లు. పరిశ్రమలోని ఇతర ఉన్నతాధికారులతో పోలిస్తే నిరాడంబరంగా ఉంటుంది. ఆయన ఆదాయంలో టాటా సన్స్‌లో ఆయనకు చిన్న వ్యక్తిగత వాటా నుంచి డివిడెండ్లు కూడా ఉన్నాయి. అలాగే, ఇతర ఆస్తులు సైతం ఉన్నాయి. ముంబయిలోని కోలాబాలో సముద్రానికి ఎదురుగా ఉన్న రూ.150 కోట్లకుపైగా విలువైన బంగ్లా ఉన్నది. ఆయనకు ఇష్టమైన కార్లలో నానో ఒకటి. ఇటీవల ముంబయి తాజ్ హోటల్లో జరిగిన ఓ ఈవెంట్లో రతన్ టాటా నానో కారులో వచ్చారు.
రతన్ టాటా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరు. టాటా గ్రూప్‌లో అతిపెద్ద కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దీని మార్కెట్ విలువ 170 బిలియన్ డాలర్లు. అయినా కూడా ఎప్పుడూ రతన్ టాటా పేరు ప్రపంచ బిలియనీర్ల జాబితాలో కనిపించలేదు. రతన్ టాటాతో సహా మొత్తం కుటుంబం తమ కంపెనీల షేర్లలో ఎక్కువ భాగాన్ని తమ వద్ద ఎప్పుడూ ఉంచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. కుటుంబం గ్రూప్ నుంచి వచ్చే ఆదాయాన్ని టాటా ట్రస్ట్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ట్రస్టులు విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి పనులకు డబ్బును ఖర్చు చేస్తుంటాయి. టాటా సన్స్ లాభాల్లో దాదాపు 66 శాతం ఛారిటబుల్ ట్రస్టులకు వెళ్తుంది. రతన్ టాటా స్వయంగా కూడా టాటా సన్స్‌లో తక్కువగా వాటా ఉన్నది. అందుకే టాటా పేరు బిలియనీర్ల జాబితాలో కనిపించదు.