లక్నో: ప్రతిష్టాత్మక ఇరానీ కప్లో రంజీ చాంపియన్ ముంబై జట్టు తొలి రోజు నిలకడగా ఆడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.
కెప్టెన్ అజింక్యా రహానే (86 బ్యాటింగ్), సర్ఫరాజ్ ఖాన్ (54 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ (57) అర్ధ సెంచరీతో మెరిశాడు.