Lords Test | క్రాంతికి మూడు వికెట్లు.. పోరాడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్..!
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజే ఆలౌటైన టీమిండియా.. రెండో రోజు ఇంగ్లండ్‌ను వణికించింది. మొదటి సెషన్లోనే పేసర్ క్రాంతి గౌడ్(3-25) వికెట్ల వేట కొనసాగించగా.. ఆతిథ్య జట్టు బెంబేలెత్తిపోయింది.
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజే ఆలౌటైన టీమిండియా.. రెండో రోజు ఇంగ్లండ్‌ను వణికించింది. మొదటి సెషన్లోనే పేసర్ క్రాంతి గౌడ్(3-25) వికెట్ల వేట కొనసాగించగా.. ఆతిథ్య జట్టు బెంబేలెత్తిపోయింది. మరో ఎండ్‌లో సయాలీ సత్ఘరే(1-36), స్నేహ్ రాణా(1-35) రెచ్చిపోగా సగం మంది పెవిలియన్ చేరారు. అర్ధ శతకం బాదిన అమీ జోన్స్ (52) వెనుదిరిగినా.. పట్టువదలకుండా క్రీజునంటుకున్న కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(39 నాటౌట్) పోరాడుతోంది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ 150 కూడా కొట్టలేకపోయింది.
స్వదేశంలో చెలరేగాలనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లకు భారత పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. లార్డ్స్ టెస్టులో క్రాంతి గౌడ్(3-25) నిప్పులు చెరగడంతో తొలి రోజే ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను కోల్పోయిన ఆతిథ్య జట్టు.. రెండో రోజు తొలి సెషన్లోనూ మరో రెండు వికెట్లు నష్టపోయింది. ఓపెనర్ మియా బౌచిర్(23)ను పెవిలియన్ చేర్చిన స్పీడ్‌స్టర్.. బౌండరీలతో చెలరేగుతున్న అలిసే క్యాప్సే(9)ను స్వింగ్‌తో వెనక్కి పంపింది.
Off stump uprooted 💥
Kranti Gaud with a peach of a delivery to dismiss Alice Capsey 🔥
Updates ▶️ https://t.co/O1rEau8j8n#TeamIndia | #ENGvIND pic.twitter.com/THyQjna37j
— BCCI Women (@BCCIWomen) July 11, 2026
జోన్స్ ఫిఫ్టీ
మియా వికెట్ అనంతరం సయాలీ సత్ఘరే(1-32) ఓవర్లో హీథర్ నైట్(9) వికెట్ల ముందు దొరికిపోయింది. ఫలితంగా.. ఆట మొదలైన అరగంటలోనే ఆతిథ్య జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం అమీ జోన్స్(52) జతగా కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(39 నాటౌట్) నిలిచింది. వీరిద్దరూ వికెట్ కాచుకొని స్కోర్ వంద దాటించారు.
Partnership broken 💥
Sneh Rana with the big wicket of Amy Jones as #TeamIndia get their 5️⃣th ✋
Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/9PRDihbx7X
— BCCI Women (@BCCIWomen) July 11, 2026
అయితే.. లంచ్ బ్రేక్‌కు ముందు స్నేహ్ రానా(1-35) కీలక వికెట్ తీసింది. ఐదో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పిన అమీ జోన్స్‌ను ఔట్ చేసి ఐదో వికెట్ అందించింది. భోజన విరామం ప్రకటించేసరికి స్కోర్.. 137/5. ఇంకా ఇంగ్లండ్ 148 పరుగులు వెనకంజలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

