IPL 2024 RR vs RCB | టాస్ గెలిచిన రాజస్థాన్.. ఆర్సీబీ యువకెరటంపై వేటు
IPL 2024 RR vs RCB : ఐపీఎల్ 17వ సీజన్ హ్యాట్రిక్ విజయాలు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్...
IPL 2024 RR vs RCB : ఐపీఎల్ 17వ సీజన్ హ్యాట్రిక్ విజయాలు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. బెంగళూరు జట్టు గత మ్యాచ్‌లో విఫలమైన అనుజ్ రావత్ స్థానంలో సౌరవ్ చౌహన్‌ను తీసుకుంది. జోరు మీదున్న రాజస్థాన్ ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్‌మైర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నంద్రే బర్గర్, చాహల్.
బెంగళూరు తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), సౌరవ్ చౌహన్, రీసే టాప్లే, మయాంక్ దగర్, సిరాజ్, యశ్ దయాల్.
ప్రతి సిక్సర్‌కు ఆ ఇండ్లలో..
ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు ఆరు ఇండ్లలో సౌర వెలుగులు నింపనుంది. అవును.. ఒక్కో సిక్సర్‌కు ఆరు చొప్పున సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనుంది. సాంబార్ జిల్లాతో పాటు రాజస్థాన్‌లోని పేద ఇండ్లలో సోలార్ వెలుగులు నింపేందుకు ఫ్రాంచైజీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. దాంతో, పవర్ హిట్టర్లతో నిండిన బెంగళూరు, రాజస్థాన్ జట్లు ఎన్ని సిక్సర్లు కొడుతాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

