IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మరో పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) రికార్డు సెంచరీతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన పరాగ్ సేన ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఢీ కొడుతోంది. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక వరుసగా 5 విజయాలతో ప్లే ఆఫ్స్‌లో రేసులోకి దూసుకొచ్చిన ముంబై ఏ మార్పులు లేకుండా ఆడనుంది. రాజస్థాన్ మాత్రం రెండు మార్పులు చేసింది.
గాయం నుంచి కోలుకోని సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. గాయపడిన హసరంగ స్థానంలో కుమార్ కార్తికేయ, సందీప్ శర్మ బదులు ఆకాశ్ మధ్వాల్ తుది జట్టులోకి వచ్చారు. అయితే.. గత రెండు మ్యాచుల్లో చెలరేగి ఆడిన వైభవ్.. ఈసారి ముంబై పేస్ త్రయాన్ని ఉతికారేస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ఇరుజట్లు 29 సార్లు ఎదురుపడ్డాయి. అయితే.. ముంబై 15 విజయాలతో టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ 14సార్లు గెలుపొందింది.
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, కార్బిన్ బాస్చ్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా.
ఇంప్యాక్ట్ సబ్స్ : రాజ్ భవ, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్, రీసే టాప్లే, కరణ్ శర్మ.
🚨 Toss 🚨@rajasthanroyals won the toss and opted to bowl first against @mipaltan
Updates ▶️ https://t.co/t4j49gXHDu#TATAIPL | #RRvMI pic.twitter.com/H3Z2V7mkDx
— IndianPremierLeague (@IPL) May 1, 2025
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీశ్ రానా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, థీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్, ఫజల్హక్ ఫారూఖీ.
ఇంప్యాక్ట్ సబ్స్ : శుభం దూబే, తుషార్ దేశ్‌పాండే, కృనాల్ సింగ్, యుధ్వీర్ సింగ్, క్వెనా మఫాకా.