జైపూర్: ఐపీఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ మళ్లీ గాయపడ్డాడు. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా పక్కటెముకల నొప్పితో ఇబ్బందిపడ్డ శాంసన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
సొంత ఇలాఖాలో లక్నోతో మ్యాచ్‌కు దూరమైన శాంసన్ గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని రాజస్థాన్ ఫ్రాంచైజీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే శాంసన్ కోలుకుని జట్టులోకి తిరిగి ఎప్పుడు వస్తాడన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.