చెన్నై : స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇటీవల స్లో ఓవర్‌రేట్ కారణంగా చాలా మ్యాచ్‌లు నాలుగు గంటలకు పైగా సాగుతుండడం చర్చనీయాంశమైంది. ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు తొలి తప్పిదమిది.
బుధవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చివరి బంతివరకు పోరాడి గెలిచింది. ఈ విజయంతో రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.