రాజస్థాన్ రాయల్స్ చీఫ్ కోచ్గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ నియమితుడయ్యాడు. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ రాయల్స్ యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
గతంలో కెప్టెన్గా, కోచ్గా వ్యవహరించిన ద్రవిడ్.. తిరిగి రాజస్థాన్ జట్టుకు సేవలందించబోతున్నాడు.