Ranji Trophy | జైపూర్: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్- బీ మ్యాచ్‌లో రాజస్థాన్ దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 425 పరుగులకు ఆలౌట్ అయింది. మహిపాల్ లోమ్రర్ (111), శుభమ్ గర్హవల్ (108) సెంచరీలతో కదంతొక్కగా జుబేర్ అలీ (57) అర్ధ సెంచరీ సాధించడంతో ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 15 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (3/104) ఫర్వాలేదనిపించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసి 21 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.