Police Cricketer : మనదేశంలో క్రికెట్(Cricket)ను ఒక ఆటలా కాకుండా ఒక మతంలా ఆరాధించే వాళ్లు కోకొల్లలు. కోట్లాది మంది అభిమాన క్రీడగా వెలుగొందుతున్న క్రికెట్లో వెలుగులోకి రాని ఆణిముత్యాలు ఎన్నో. మన దేశ జనాభాలో జాతీయ జట్టుకు ఆడేది తక్కువ తక్కువ మందే. ప్రతిభకు అదృష్టం తోడైతేనే దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. అయితే.. ప్రతిభ ఉన్నా జాతీయ జట్టులోకి రాలేకపోయిన కొంత మంది అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటారు. రాజస్థాన్ పోలీస్(Rajasthan Police) శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి కూడా ఆ కోవకే చెందుతాడు.
అతడి బౌలింగ్ శైలి చూస్తే వారెవ్వా అనాల్సిందే. ప్రొఫెషనల్ బౌలర్‌ను తలపిస్తున్న అతను నెట్స్‌లో బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేస్తున్న తీరు అద్భుతం. ఒక నాణ్యమైన పేసర్లో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఈ పోలీస్ అధికారి పేరు దుర్జన్ హసల్(Durjan Hasan).
దుర్జన్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్(Mumbain Indians) ఫ్రాంచైజీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇంకేముంది పలువురు అభిమానులు దుర్జన్ ప్రతిభను కొనియాడుతూ కామెంట్లు రాసుకొచ్చారు. ‘అద్భుతమైన కొందరు ప్రతిభావంతుల కెరీర్ బాధ్యతలతో ముగుస్తాయి’ అని రాసుకు రాగా. మరొకరు ‘క్రికెట్ అనేది ఒక ఆట కాదు..ఒక ఎమోషన్’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఇలా ప్రతిభను వెలికితీయడంలో ముంబై ఇండియన్స్ ఎప్పుడు ముందు ఉంటుంద’ని మరొకరు అభిప్రాయపడ్డారు. మొత్తంగా దుర్జన్ హసల్ రూపంలో ఒక ప్రతిభ కల్గిన క్రికెటర్ వెలుగులోకి రావడం గొప్ప విషయం అని చెప్పాలి.