Cristiano Ronaldo | ఇన్‌స్టాగ్రామ్‌ను ముంచెత్తిన రొనాల్డో.. 60 కోట్లమంది ఫాలోవర్స్‌తో రికార్డు
Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు వింటే ఫుట్‌బాల్ అభిమానుల(Football Fans)కు పూనకలే! అంతలా ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేసిన రొనాల్డో రికార్డుల మీద రికార్డులు తిరుగరాస్తూనే ఉన్నాడు. ఈ పోర్చుగల్ స్టార్(Portugal Star) తాజాగా మరో ఘనత ఖాతాలో వేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఏకంగా 600 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ చేరుకున్నాడు. అంటే..
Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు వింటే ఫుట్‌బాల్ అభిమానుల(Football Fans)కు పూనకలే! అంతలా ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేసిన రొనాల్డో రికార్డుల మీద రికార్డులు తిరుగరాస్తూనే ఉన్నాడు. ఇప్పటికే లెక్కలు మిక్కిలి రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ పోర్చుగల్ స్టార్(Portugal Star) తాజాగా మరో ఘనత ఖాతాలో వేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఏకంగా 600 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ చేరుకున్నాడు. అంటే.. అతడి 60 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
దాంతో, రికార్డు స్థాయిలో ఇంతమంది అభిమానులను దక్కించుకున్న తొలి వ్యక్తిగా రొనాల్డో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi)కి 482 మిలియన్.. అంటే 48 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోని మేటి ఫుట్‌బాలర్ అయిన రొనాల్డో నిరుడు నవంబర్‌లో 500 మిలియన్ల(50 కోట్ల) ఫాలోవర్లను చేరుకున్నాడు. ఈ ఫార్వర్డ్ ప్లేయర్ స్వల్ప వ్యవధిలోనే మరో 10 కోట్ల అభిమాన గణాన్ని సంపాదించాడు.
తన అద్బుత ఆటతీరుతో మైదానంలో ప్రత్యర్థులకు సింహస్వప్నంలా నిలిచే రొనాల్డో భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు కొల్లగొడుతాడనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు అనిపోస్తుంది. ప్రస్తుతం రొనాల్డో సౌదీ అరేబియా(Soudi Arabia)కు చెందిన ఆల్ నాసర్(Al Nassr) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవిషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
India – Pakistan | టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. ఎందుకో తెలుసా..?
Ambati Rayudu | కరీబియన్ లీగ్‌లో అంబటి రాయుడు.. రెండో భారత క్రికెటర్‌గా రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

