India – Pakistan : భారత్, పాకిస్థాన్ అంటే ఉప్పునిప్పు! ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ యుద్ధాన్ని తలపిస్తుంది. చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం కోట్లాది మంది ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య గత కొన్నేండ్లుగా ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)లు జరుగడం లేదు. ఐసీసీ(ICC) టోర్నీలతో పాటు ఆసియా కప్(Asia Cup) లాంటి టోర్నీల్లోనే దాయాదులు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ నెలాఖర్లో మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌లో భారత్, పాక్ ఢీ కొంటున్నాయి. అయితే ఆతిథ్య హోదాలో ఉన్న పాకిస్థాన్ పేరు టీమ్ఇండియా క్రికెటర్ల జెర్సీ(Team India Jersey)లపై కనిపించనుంది. ఆసియా కప్ లోగో(Asia Cup Logo 2023)పై పాకిస్థాన్ అంటూ ప్రత్యక్షం కానుంది.
షెడ్యూల్‌ను అనుసరించి టోర్నీలో మ్యాచ్‌లన్నీ పాక్‌లో జరుగాల్సింది. కానీ టీమ్ఇండియా ససేమిరా అనడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) మధ్యేమార్గంగా పాక్‌తో పాటు శ్రీలంకకు కొన్ని మ్యాచ్‌లు కేటాయించింది. దీంతో పాక్‌లో కాకుండా భారత్ తమ మ్యాచ్‌లన్నీ లంకలో ఆడనుందివన్డే ప్రపంచ కప్ పోటీలకు సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరుగనుంది.
ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ ఆజాం
ఇప్పటికే రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా విజేతగా నిలిచిన భారత్.. మరోమారు సగర్వంగా కప్‌ను ముద్దాడాలని చూస్తున్నది. ఇదే జరిగితే స్వదేశం వేదికగా వన్డే మెగాటోర్నీకి ముందు రోహిత్‌సేనకు మంచి కిక్ దొరికినట్లే. గతేడాది ఫైనల్ చేరడంలో విఫలమైన టీమ్ఇండియా..ఈసారి కచ్చితంగా ట్రోఫీ కైవసం చేసుకునేందుకు తహతహలాడుతున్నది. చూద్దాం ఏం జరుగుతుందో.. వెయిట్ అండ్ సీ.