Ambati Rayudu : భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) మళ్లీ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఈమధ్యే వీడ్కోలు పలికిన అతను కరీబియన్ లీగ్(Caribbean Premier League)లో దంచి కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అవును.. ఈ 37 ఏళ్ల కుడి చేతివాటం బ్యాటర్ తాజాగా సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్(St Kitts & Nevis Patriots) జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంతో, ఈ లీగ్‌లో ఆడుతున్న రెండో భారత క్రికెటర్‌గా రాయుడు రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ప్రవీణ్ తాంబే(Pravin Tambe) ఈ లీగ్‌లో ఆడాడు.
ఐపీఎల్ పదహారో సీజన్లో రాయుడు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టుకు ఆడాడు. అయితే.. ఫైనల్ మ్యాచ్‌కు ముందే అతను ఐపీఎల్‌కు రిటైర్మెంట్ పలుకుతున్నానని చెప్పాడు. దాంతో, రాయుడుకు ఘనమైన వీడ్కోలు పలకాలని సీఎస్కేయాజమాన్యం అనుకుంది. అనుకున్నట్టుగానే ట్రోఫీ సాధించి ఈ స్టార్ ఆటగాడికి గొప్ప బహుమతి ఇచ్చింది. దాంతో, ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన క్రికెటర్‌గా రాయుడు తన కెరీర్ ముగించాడు.
అంబటి రాయుడికి ట్రోఫీ అందిస్తున్న బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ
అంతేకాదు రాయుడు త్వరలోనే మేజర్ క్రికెట్ లీగ్ (Major Cricket League)లో బరిలోకి దిగనున్నాడు. సీఎస్కే ఫ్రాంచైజీకి చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున కూడా ఈ స్టార్ ఆటగాడు ఆడనున్నాడు. అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్(Cooing Off Period)పై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిబంధన ప్రకారం క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లు వెంటనే ఇతర దేశాల్లో ప్రాంఛైజీ క్రికెట్ ఆడడానికి అనుమతిలేదు. దాదాపు ఏడాది తర్వాతే వాళ్లు ఇతర లీగ్స్‌లో పాల్గొనవచ్చు.